Published : 13 Jun 2021 12:26 IST

Vaccine: అమెరికాలో టీకా ‘గడువు’ ప్రమాదం

వృథా కానున్న లక్షల డోసులు!

వాషింగ్టన్‌: భారత్‌ సహా ప్రపంచంలో అత్యధిక దేశాలు వ్యాక్సిన్ల కొరతతో ఇబ్బంది పడుతుంటే అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు సగం జనాభా టీకాలు వేసుకున్నా, మిగతా వారు అంతగా ఆసక్తి చూపకపోవడంతో టీకాల గడువు (ఎక్స్‌పైరీ) ముగిసే ప్రమాదం పొంచి ఉంది. దీంతో లక్షలాది డోసులు వృథా అయ్యే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. టెన్నెసీ, నార్త్‌ కరోలినాలు ఇప్పటికే మిలియన్ల కొద్దీ డోసులను ఫెడరల్‌ ప్రభుత్వానికి తిరిగి పంపించాయి. కొత్త వ్యాక్సిన్లకు ఒక్లహామా ఆర్డరే పెట్టడం లేదు. ఇప్పటికే ఆ రాష్ట్రం దగ్గర ఏడు లక్షలపైగా డోసులు నిల్వ ఉన్నాయి. అయితే రోజుకు 4,500 మందే అక్కడ వ్యాక్సిన్‌ వేసుకుంటున్నారు. మోడెర్నా, ఫైజర్‌కు సంబంధించిన 27 వేల టీకాల గడువు ఈ నెలాఖరుకల్లా ముగియనుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాల పరిస్థితీ అంతే. ఈ టీకాల గడువు తేదీని ఆరు వారాలకు ప్రభుత్వం పొడిగించింది. అయినా అప్పట్లోకి వాటి వినియోగం కష్టమేనని అధికారులు చెబుతున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని