కేరళలో వలస కూలీకి రూ.75 లక్షల జాక్‌పాట్‌!

ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని కేరళకు వచ్చిన వలసకూలీ ఎస్‌.కె.బాదేశ్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ.75 లక్షలు లాటరీ తగిలి.. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు.

Published : 18 Mar 2023 06:42 IST

ఈటీవీ భారత్‌: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని కేరళకు వచ్చిన వలసకూలీ ఎస్‌.కె.బాదేశ్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ.75 లక్షలు లాటరీ తగిలి.. రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. తన టికెటుకు లాటరీ తగిలిందన్న ఆనందం ఓవైపు.. ఆ టికెటును ఎవరైనా కాజేస్తారేమో అనే భయం ఇంకోవైపు వెంటాడింది. ఏం చేయాలో తోచక పోలీస్‌స్టేషనుకు బాదేశ్‌ పరుగు తీశాడు. వివరాల్లోకి వెళ్తే.. బెంగాల్‌కు చెందిన బాదేశ్‌ ఎర్నాకులంలోని చొట్టానికరలో రోడ్డు నిర్మాణపనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటున్న బాదేశ్‌.. ఎప్పటిలాగే కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్త్రీశక్తి లాటరీ వద్ద టికెట్‌ కొనుగోలు చేశాడు. ఆ టికెట్‌పై మంగళవారం రాత్రి రూ.75 లక్షల లాటరీ తగలడంతో అతడి ఆనందానికి హద్దుల్లేవు. పోలీసులను ఆశ్రయించిన బాదేశ్‌.. తన ప్రైజ్‌ మనీకి రక్షణ కల్పించాలని కోరాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు