Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ
దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆర్థిక నేరాల్లో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైలు నుంచే మరో ప్రేమలేఖ రాశాడు.
దిల్లీ: దాదాపు రూ.200 కోట్ల విలువైన ఆర్థిక నేరాల్లో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తన సన్నిహితురాలు, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైలు నుంచే మరో ప్రేమలేఖ రాశాడు. ‘‘మై బేబీ జాక్వెలిన్.. నా పుట్టినరోజున నిన్ను చాలా మిస్ అవుతున్నా. నా చుట్టూ నీ ఎనర్జీ లేని లోటు కనిపిస్తోంది. కానీ, నా మీద నీకున్న ప్రేమ అనంతమని, ఎన్నటికీ తరగదని నాకు తెలుసు. నీ అందమైన హృదయంలో ఏముందో నాకు తెలుసు. దానికి రుజువులు అక్కర్లేదు. నా జీవితంలో వెలకట్టలేని అత్యంత విలువైన కానుక నువ్వు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా బుట్టబొమ్మ’’ అని సుకేశ్ ఆ లేఖలో రాసుకొచ్చాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల హోలీ సందర్భంగా సుకేశ్.. నటికి ఇలాంటి ప్రేమ సందేశాన్నే పంపిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్