Karnataka Results : స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు

ఈసారి కర్ణాటక ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అతికొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కడం ఆసక్తికరం. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి- మాజీ మంత్రి దినేశ్‌ గుండూరావు రాజధాని పరిధిలోని గాంధీనగరలో తొలుత 900 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Published : 14 May 2023 08:27 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ఈసారి కర్ణాటక ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు అతికొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కడం ఆసక్తికరం. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి- మాజీ మంత్రి దినేశ్‌ గుండూరావు రాజధాని పరిధిలోని గాంధీనగరలో తొలుత 900 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. ఓట్లను మళ్లీ లెక్కించాలని భాజపా అభ్యర్థి సప్తగిరిగౌడ పట్టుపట్టారు. రెండోసారి లెక్కించాక... దినేశ్‌ 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. దినేశ్‌కు 53,972 ఓట్లు, సప్తగిరిగౌడకు 53,867 ఓట్లు దక్కాయి. ఇక్కడ భాజపా తిరుగుబాటు అభ్యర్థి కృష్ణయ్యశెట్టి 4500 ఓట్లు పొందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని