70 ఏళ్లొచ్చినా.. ఇంకా భర్తపై ఆరోపణలా..!

భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న కారణంతో భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు సమర్థించింది.

Updated : 15 Mar 2024 05:42 IST

భార్య అప్పీల్‌ను తిరస్కరించిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: భార్య క్రూరత్వానికి పాల్పడిందన్న కారణంతో భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు సమర్థించింది. విడాకుల డిక్రీని రద్దు చేయాలని భార్య వేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. ‘‘ఇందులో వాది ప్రతివాదులకు ఏడు పదుల వయసు దాటింది. ఈ వయసులో కూడా వాది (భార్య) ఈ వివాదానికి ముగింపు పలకకుండా ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారు. వ్యాజ్యాల మీద వ్యాజ్యాలు వేస్తున్నారు. ఆమె తీరు చూస్తే భర్తలో ఏ కొంత మంచితనాన్ని కూడా చూడడానికి ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. 2013 నుంచి విడిగా ఉంటున్నా.. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆమె సుముఖంగా లేదు’’ అని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో వాది ప్రతివాదులకు 1973లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన 41 ఏళ్ల తర్వాత క్రూరత్వం కింద భర్త విడాకులు కోరారు. 2018లో ఫ్యామిలీ కోర్టు మంజూరుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని