నీట్‌-పీజీ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం

ఈ ఏడాది జూన్‌ 23న జరిగే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Published : 30 Apr 2024 04:41 IST

దిల్లీ: ఈ ఏడాది జూన్‌ 23న జరిగే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై కొద్దిసేపు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. దీన్ని తాము పొడిగించలేమని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్‌ ఈ పిటిషన్‌ వేశారు. దీనిపై సంబంధిత అధికారులను ఆశ్రయించే స్వేచ్ఛను పిటిషనర్‌కు ధర్మాసనం ఇచ్చింది. నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీని ఆగస్టు 15గా అధికారులు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని