శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు

శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్‌ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు.

Published : 30 Apr 2024 04:43 IST

అయోధ్య: శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్‌ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఈ బాధ్యతను పర్యాటకశాఖకు అప్పగించింది. మే 19న శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రత్యేక కలశంలో పవిత్ర జలాన్ని శ్రీలంకకు పంపుతున్నట్లు అయోధ్య తీర్థవికాస్‌ పరిషత్‌ సీఈవో సంతోష్‌కుమార్‌ శర్మ తెలిపారు. ఈ వేడుక భారత్‌, శ్రీలంకల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. శ్రీలంకలోని సీతమ్మ ఆలయం సనాతన ధర్మానికి ప్రతీకగా ఉంటుందని మహంత్‌ శశికాంత్‌ దాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని