తిరువనంతపురం మేయర్‌ పీఠంపై ఆర్య రాజేంద్రన్‌ 

దేశ రాజకీయాల్లో మార్పునకు నాంది పలుకుతూ.. తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ సోమవారం ప్రమాణం చేశారు. అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన తొలి

Updated : 29 Dec 2020 11:48 IST

తిరువనంతపురం: దేశ రాజకీయాల్లో మార్పునకు నాంది పలుకుతూ.. తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్‌ సోమవారం ప్రమాణం చేశారు. అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన తొలి మేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఈ అరుదైన ఘట్టానికి నగర కార్పొరేషన్‌ మండలి భవనం వేదికైంది. కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా గెలుపొంది అందరి దృష్టిని ఆర్య ఆకర్షించారు. 100 మందిలో 54 మంది కార్పొరేటర్లు మద్దతు తెలుపుతూ ఆమెను మేయర్‌గా ఎన్నుకున్నారు. ముడవన్‌ముగల్‌ వార్డు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్య.. తిరువనంతపురంలో చెత్త నిర్వహణపైనే ప్రధాన దృష్టి సారిస్తానని చెప్పారు. ప్రస్తుతం ఆమె బీఎస్సీ చదువుతున్నారు. వామపక్ష బాలల విభాగమైన బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా ఆర్య పనిచేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ, ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌ ఆర్యకు అభినందనలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని