అఫ్గాన్‌ పరిస్థితికి అమెరికాదే బాధ్యత

అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే బాధ్యత వహించాలని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వం వహిస్తున్న సెంటర్‌-రైట్‌ యూనియన్‌ బ్లాక్‌లోని నాయకుడు మార్కస్‌ సోడ పేర్కొన్నారు.

Updated : 20 Aug 2021 06:36 IST

జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ సహచరుడు

బెర్లిన్‌: అఫ్గానిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే బాధ్యత వహించాలని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ నాయకత్వం వహిస్తున్న సెంటర్‌-రైట్‌ యూనియన్‌ బ్లాక్‌లోని నాయకుడు మార్కస్‌ సోడ పేర్కొన్నారు. ‘‘అఫ్గాన్‌ నుంచి సేనలను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయం అమెరికాయే తొందరపడి తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితికి ఆ దేశానిదే ప్రధాన బాధ్యత’’ అని తెలిపారు. శరణార్థుల విషయంలోనూ అగ్రరాజ్యం జాగ్రత్తలు తీసుకోవాలని, అఫ్గాన్‌ పొరుగు దేశాలకు సాయం చేయాలని కోరారు. 2015లో ఆసియా, ఆఫ్రికా నుంచి ఐరోపాకు శరణార్థులు వలస వచ్చారని, అలాంటి సంక్షోభం తలెత్తకుండా అమెరికా చూసుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని