సింఘు సరిహద్దు శిబిరాల్లో కొనసాగుతాం

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో కొనసాగుతున్న ఆందోళనల్లో పాల్గొంటామని, నిరసన శిబిరాలను వదిలి వెళ్లబోమని నిహంగ్‌ సిక్కు నేతలు ప్రకటించారు. సిక్కు మత గ్రంథాన్ని దూషించారనే నెపంతో లఖ్‌బీర్‌ సింగ్‌ అనే వ్యక్తిని

Published : 29 Oct 2021 06:12 IST

 నిహంగ్‌ సిక్కుల ప్రకటన

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో కొనసాగుతున్న ఆందోళనల్లో పాల్గొంటామని, నిరసన శిబిరాలను వదిలి వెళ్లబోమని నిహంగ్‌ సిక్కు నేతలు ప్రకటించారు. సిక్కు మత గ్రంథాన్ని దూషించారనే నెపంతో లఖ్‌బీర్‌ సింగ్‌ అనే వ్యక్తిని నిహంగ్‌ సిక్కులకు చెందిన కొందరు వ్యక్తులు ఈ నెల 15న దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సింఘు సరిహద్దుల్లోని పోలీస్‌ బ్యారికేడ్ల వద్ద జరిగింది. దీంతో నిరసన శిబిరాలను వదిలి వెళ్లాల్సిందిగా నిహంగ్‌ సిక్కులను రైతుల ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా కోరింది. దీనిపై తాము మహాపంచాయత్‌లో చర్చించుకున్నామని, రైతుల ఆందోళనకు మద్దతు కొనసాగించాలనే నిర్ణయించామని నిహంగ్‌ సిక్కుల ప్రతినిధి వెల్లడించారు. లఖ్‌బీర్‌ సింగ్‌ హత్య కేసులో ఇద్దరు నిహంగ్‌లను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు లొంగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని