అక్టోబరు నుంచి తయారయ్యే వాహనాలకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు

ఈఏడాది అక్టోబరు నుంచి తయారయ్యే ఎం1 వాహనాల్లో (8 మంది వరకు ప్రయాణించే వీలున్న) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది.

Published : 17 Jan 2022 04:42 IST

ఈనాడు, దిల్లీ: ఈఏడాది అక్టోబరు నుంచి తయారయ్యే ఎం1 వాహనాల్లో (8 మంది వరకు ప్రయాణించే వీలున్న) కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర రహదారి, రవాణా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఇందులో ఒక జత ఎయిర్‌బ్యాగ్స్‌ ముందువైపు సీట్లలో కూర్చున్న వారి కోసం, మరో జత కర్టెన్‌/ట్యూబ్‌ ఎయిర్‌బ్యాగ్‌లను వెనుకసీట్లలో కూర్చున్న వారి రక్షణ కోసం ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాహనంలో అంతర్గతంగా వీటిని ఏర్పాటు చేయాలని, ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌తో పాటు ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించేలా డిజైన్‌ చేయాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని