Gaganyaan: గగన్‌యాన్‌ దిశగా.. తొలి అడుగు విజయవంతం

భారత్‌ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హ్యూమన్‌-రేటెడ్‌ సాలిడ్‌ రాకెట్ బూస్టర్‌...

Published : 14 May 2022 09:18 IST

బెంగళూరు (గ్రామీణం), సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: భారత్‌ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హ్యూమన్‌-రేటెడ్‌ సాలిడ్‌ రాకెట్ బూస్టర్‌ (హెచ్‌ఎస్‌200) ప్రయోగం విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు శుక్రవారం ప్రకటించారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి హెచ్‌ఎస్‌-200కు సంబంధించి ఎస్‌-200 రాకెట్ను జి.ఎస్‌.ఎల్‌.వి. ఎం.కె.-3 (ఎల్‌.వి.ఎం.3) ఉపగ్రహాల ప్రయోగ వాహకనౌక ద్వారా ప్రయోగించారు. ఇది విజయవంతం కావడంతో గగన్‌యాన్‌లో కీలక మైలురాయికి చేరుకున్నామని ఇస్రో అధికారి ఒకరు తెలిపారు. ఇస్రో అధ్యక్షుడు ఎస్‌.సోమనాథ్, విక్రం సారాభాయి స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఉన్నికృష్ణన్, ఇతర శాస్త్రవేత్తల సమక్షంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఎస్‌.200 మోటారును ఎల్‌.వి.ఎం.3 వాహకనౌక 4,000 కిలోల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకు వెళ్లేందుకు సహకరిస్తుంది. గతంలో చంద్రయాన్‌ మిషన్‌లోనూ ఎల్‌.వి.ఎం.3 ప్రయోగ వాహనాన్ని వినియోగించారు. హెచ్‌.ఎస్‌.200 బూస్టర్‌ను 203 టన్నుల ఘన ఇంధనంతో నింపి 135 క్షణాల పాటు పరీక్షించారు. ఇది 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్‌ అని ఇస్రో ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని