ఇజ్రాయెల్‌ కొత్త ప్రధానికి మోదీ అభినందనలు

ఇజ్రాయెల్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యయిర్‌ లాపిడ్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అభినందించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 30 ఏళ్లు నిండిన

Published : 02 Jul 2022 05:00 IST

దిల్లీ, జెరూసలేం: ఇజ్రాయెల్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన యయిర్‌ లాపిడ్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అభినందించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 30 ఏళ్లు నిండిన నేపథ్యంలో ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు సాగాలని అభిలషించారు. ఇజ్రాయెల్‌ పార్లమెంటు గురువారం రద్దయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ సంకీర్ణ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన లాపిడ్‌ను నవంబరు నెలలో ఎన్నికలు జరిగేదాకా తాత్కాలిక ప్రధానిగా నియమించారు. ప్రధాని పదవి నుంచి వైదొలగిన నఫ్తాలి బెన్నెట్‌ను సైతం ‘భారత్‌కు నిజమైన స్నేహితుడి’గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలకు స్పందనగా మోదీకి బెన్నెట్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌’ పత్రిక కథనం ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు బెన్నెట్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని