తీస్తాపై వ్యాఖ్యలను సుప్రీం ఉపసంహరించుకోవాలి

గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ, ఇతరులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ సహా పిటిషన్‌దారులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై 92 మంది విశ్రాంత ఉన్నతాధికారులు

Published : 07 Jul 2022 03:59 IST

 92 మంది విశ్రాంత ఉన్నతాధికారుల బహిరంగ లేఖ

దిల్లీ/అహ్మదాబాద్‌: గుజరాత్‌ అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ, ఇతరులకు క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ సహా పిటిషన్‌దారులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై 92 మంది విశ్రాంత ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం బహిరంగలేఖ విడుదల చేశారు. గత నెల 24న వెలువరించిన తీర్పులోని 88వ పేరాపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీస్తాను అరెస్టు చేయాలన్నది తమ ఉద్దేశం కాదన్న విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేయాలని కోరారు. పిటిషన్‌ను కొట్టివేసిన మరుసటిరోజే గుజరాత్‌ పోలీసులు.. సీతల్వాడ్‌ను అదుపులోకి తీసుకొని అనంతరం అరెస్టు చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జి.కె.పిళ్లై, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి సుజాతా సింగ్‌, మాజీ సీఐసీ హబీబుల్లా, ఆరోగ్యశాఖ మాజీ కార్యదర్శి కె.సుజాతారావు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని