Viral news: ఒకే సూదితో 39 మంది విద్యార్థులకు టీకాలు!

ఒకే సూది (సిరంజీ)తో ఏకంగా 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకా డోసులు వేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ నగరంలోని జైన్‌ హయ్యర్‌ సెకెండరీ స్కూల్‌లో బుధవారం

Updated : 29 Jul 2022 04:59 IST

మధ్యప్రదేశ్‌లో ఘటన..

సాగర్‌: ఒకే సూది (సిరంజీ)తో ఏకంగా 39 మంది విద్యార్థులకు కొవిడ్‌ టీకా డోసులు వేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సాగర్‌ నగరంలోని జైన్‌ హయ్యర్‌ సెకెండరీ స్కూల్‌లో బుధవారం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. 9-12 తరగతులకు చెందిన 15 ఏళ్లు పైబడిన 39మంది విద్యార్థులకు వ్యాక్సినేటర్‌ జితేంద్ర అహిర్వార్‌ ఒకేసూదిని వాడటంతో దీన్ని కొందరు తల్లిదండ్రులు గుర్తించి, ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న సాగర్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ క్షితిజ్‌ సింఘాల్‌ వెంటనే జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ డి.కె.గోస్వామిని అక్కడికి పంపించారు. ఆయన చేరుకోగానే అహిర్వార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. గోపాల్‌గంజ్‌ పోలీసులు గురువారం అతడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సాగర్‌ డివిజినల్‌ కమిషనర్‌ ముఖేశ్‌ శుక్లా.. జిల్లా వ్యాక్సినేషన్‌ అధికారి డాక్టర్‌ శోభారామ్‌ రోషన్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదంటూ అహిర్వార్‌ ఓ వీడియోను విడుదల చేశాడు. తనను వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద దించిన సంబంధిత విభాగాధిపతి ఒక్క సిరంజే ఇచ్చి, దాంతోనే అందరికీ టీకాలు వేయాలని సూచించారని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని