Voter id to Aadhar link: ఓటరుకార్డుతో ఆధార్‌ అనుసంధానానికి చివరి రోజు ఎప్పుడంటే..?

దేశంలో ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ 2023 ఏప్రిల్‌ 1లోగా తమ పేరును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు తెలిపారు.

Updated : 17 Aug 2022 11:15 IST

ఈనాడు, దిల్లీ : దేశంలో ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ 2023 ఏప్రిల్‌ 1లోగా తమ పేరును ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు తెలిపారు. గురువారం ఆయన రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తాజాగా సవరించిన ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ 6బి ఫారం ద్వారా తమ ఆధార్‌ నంబర్‌ను సంబంధిత ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారికి తెలపాలన్నారు. ఇది ఐచ్ఛికమని(ఆప్షనల్‌), ఒకవేళ ఎవరికైనా ఆధార్‌ నంబర్‌ లేకపోతే ఇతర డాక్యుమెంట్లను 6బి ఫారం ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు