అవయవ దానం ప్రోత్సాహానికి 43 దేశాల సంయుక్త కృషి

కామన్వెల్త్‌ క్రీడా వారసత్వం కింద 43 దేశాలు, 19 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు...అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించాయి. బ్రిటిష్‌ జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌.హెచ్‌.ఎస్‌) రూపొందించిన కామన్వెల్త్‌

Published : 07 Aug 2022 05:39 IST

లండన్‌: కామన్వెల్త్‌ క్రీడా వారసత్వం కింద 43 దేశాలు, 19 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు...అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి కలసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించాయి. బ్రిటిష్‌ జాతీయ ఆరోగ్య సర్వీసు (ఎన్‌.హెచ్‌.ఎస్‌) రూపొందించిన కామన్వెల్త్‌ ట్రిబ్యూట్‌ టు లైఫ్‌ ప్రాజెక్టు కింద అవయవదానం, అవయవ మార్పిడిలో అనుభవాన్నీ, ప్రావీణ్యాన్ని పరస్పరం పంచుకుని ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రాణాలు కాపాడాలని తీర్మానించాయి. గడచిన మూడేళ్ల నుంచి తాము జరుపుతున్న కృషి ఈ విధంగా ఫలించినందుకు ఆనందంగా ఉందని ప్రాజెక్టు సారథి డాక్టర్‌ సత్య శర్మ తెలిపారు. మరణానంతర అవయవదానం ఎందరికో ప్రాణ భిక్ష పెడుతుందనే అంశాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియబరచాలని ఆయన కోరారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా 1,46,000 అవయవాల మార్పిడి జరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 40,000 మంది సజీవ దాతలు, 39,000 మంది మృత దాతలు వీటిని దానం చేశారు. ఆస్ట్రేలియా, కెనడా, మాల్టా, బ్రిటన్‌లలో ప్రతి 10 లక్షల జనాభాలో 20 మంది అవయవదానం చేస్తుంటే, చాలా దేశాల్లో అవయవదానమే జరగడం లేదు. బ్రిటన్‌లో ఇప్పటికీ 6,400 మంది అవయవ దాతల కోసం నిరీక్షిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని