నివాస గృహాలను వ్యాపార సంస్థలకు అద్దెకిస్తేనే 18% జీఎస్‌టీ

నివాస గృహాలను ప్రైవేటు వ్యక్తులకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకు ఇచ్చిన పక్షంలో, వాటిపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అద్దెకు ఉండే వారు చెల్లించే

Updated : 13 Aug 2022 06:34 IST

దిల్లీ: నివాస గృహాలను ప్రైవేటు వ్యక్తులకు వ్యక్తిగత అవసరాల నిమిత్తం అద్దెకు ఇచ్చిన పక్షంలో, వాటిపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అద్దెకు ఉండే వారు చెల్లించే మొత్తంపై 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. నివాస గృహాలను వ్యాపార కార్యకలాపాలకిస్తేనే.. ఆ అద్దెపై జీఎస్‌టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒక వేళ కంపెనీ యజమాని లేదా భాగస్వామి సదరు గృహాలను వ్యక్తిగత అవసరాలకు ఇస్తే ఎటువంటి జీఎస్‌టీ ఉండదని తెలిపింది. దీంతో జీఎస్‌టీ నమోదిత ప్రొప్రైటర్లు లేదా భాగస్వాములకు ఊరట లభించింది. వీరు తమ స్థిరాస్తులను ఏ కుటుంబానికి వ్యక్తిగతావసరాలకు అద్దెకు ఇచ్చినా.. దానిపై జీఎస్‌టీ పడదని తేటతెల్లం అయిందని కేపీఎమ్‌జీ ఇండియా భాగస్వామి అభిషేక్‌ జైన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని