Vande bharat express: ‘వందేభారత్’ రైళ్లకు తృతీయ విఘ్నం
రైల్వేశాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరుస విఘ్నాలను ఎదుర్కొంటున్నాయి. గాంధీనగర్ - ముంబయి రైలు గురు, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజులు పశువులను ఢీకొని ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే.
5 గంటలు ఆగిన దిల్లీ - వారణాసి రైలు
దిల్లీ: రైల్వేశాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వరుస విఘ్నాలను ఎదుర్కొంటున్నాయి. గాంధీనగర్ - ముంబయి రైలు గురు, శుక్రవారాల్లో వరుసగా రెండు రోజులు పశువులను ఢీకొని ప్రమాదాలకు గురైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం దిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సమీపాన రైల్లోని సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్ మోటారులో బేరింగు పనిచేయలేదు. దీంతో చక్రాలు దెబ్బతిని మొరాయించాయి. క్షేత్ర సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి రైల్వే ఆపరేషన్స్ కంట్రోల్ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైలును నియంత్రిత వేగంతో 20 కి.మీ. దూరంలో ఉన్న ఖుర్జా రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ఆపారు. అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 1,068 మంది ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Avanigadda: మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్నా?: వారాహి యాత్రలో నిరుద్యోగుల ఆవేదన
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి