23న జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 22న తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌక ప్రయోగం ఒకరోజు వాయిదా వేశారు. వాహకనౌక అనుసంధాన కార్యక్రమాలు రెండో ప్రయోగవేదిక సమీపంలోని వ్యాబ్‌లో జరుగుతున్నాయి.

Published : 13 Oct 2022 05:15 IST

సాంకేతిక లోపాలతో ఒకరోజు వాయిదా

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని సతీశ్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 22న తలపెట్టిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌక ప్రయోగం ఒకరోజు వాయిదా వేశారు. వాహకనౌక అనుసంధాన కార్యక్రమాలు రెండో ప్రయోగవేదిక సమీపంలోని వ్యాబ్‌లో జరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని పనులూ పూర్తయ్యాయి. బుధవారం వాహక నౌకను తనిఖీలు చేస్తుండగా ఎల్‌-110లో సాంకేతిక లోపం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించినట్లు సమాచారం. దీన్ని సరిచేసేందుకు కొంత సమయం అవసరం కావడంతో ప్రయోగ తేదీని ఒక రోజు పొడిగించారు. ఈ నెల 23న 00.12 నిమిషాలకు ప్రయోగం చేసేలా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహకనౌక ద్వారా వన్‌వెబ్‌కు చెందిన, ఒక్కోటి 142 కిలోల బరువున్న 36 ఉపగ్రహాలను (5.2 టన్నులు) నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. శ్రీహరికోట నుంచి మొదటిసారిగా అత్యంత భారీ పేలోడ్స్‌ను జీఎస్‌ఎల్‌వీ మోసుకెళ్లనుండటంతో శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని