చిన్ననాటి అభిరుచికి రెక్కలు తొడిగాడు
‘చిన్నప్పుడు పక్షిలా ఎగరాలని అనుకునేవాణ్ని. చదువు పూర్తయ్యాక 1996లో వ్యవసాయం ప్రారంభించినా ఆ కోరిక మనసులో అలాగే మెదులుతూ ఉండేది’ అంటారు పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా జిల్లా సిర్యేవాలా గ్రామ రైతు యద్వీందర్ సింగ్ ఖోఖర్ (49).
బుల్లి విమానాల ఇంజినీర్‌గా పంజాబ్ రైతు
చండీగఢ్: ‘చిన్నప్పుడు పక్షిలా ఎగరాలని అనుకునేవాణ్ని. చదువు పూర్తయ్యాక 1996లో వ్యవసాయం ప్రారంభించినా ఆ కోరిక మనసులో అలాగే మెదులుతూ ఉండేది’ అంటారు పంజాబ్ రాష్ట్రంలోని బఠిండా జిల్లా సిర్యేవాలా గ్రామ రైతు యద్వీందర్ సింగ్ ఖోఖర్ (49). ఆ అభిరుచే యద్వీందర్‌ను ఏరోమోడలింగ్ దిశగా నడిపించింది. అధిక సాంద్రత కలిగిన థర్మాకోల్‌తో వివిధ మోడళ్లలో విమానాలు తయారుచేస్తున్న యద్వీందర్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. చండీగఢ్, బఠిండా, ఫగ్వాడా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఏరోనాటిక్స్‌లోని సూక్ష్మ నైపుణ్యాలను ఈ రైతు నేర్పుతున్నారు.
బ్రిటన్‌లో ఏరోమోడల్స్ చూసి..
జలంధర్‌లో డిగ్రీ చదివిన యద్వీందర్ బఠిండాలో కంప్యూటర్ అప్లికేషన్ డిప్లొమా పూర్తి చేశారు. ఆ తర్వాత 2007 దాకా వ్యవసాయం చేస్తూ.. ఆ ఏడాది బంధువుల పెళ్లికి బ్రిటన్ వెళ్లారు. అక్కడున్న ఫ్లైయింగ్ క్లబ్‌లో ఏరోమోడల్స్ చూసిన యద్వీందర్‌కు మనసులోని కోరిక మళ్లీ సందడి చేసింది. ‘అక్కడి నుంచి చిన్నపాటి ఏరో మోడల్స్ రెండు తీసుకువచ్చా. ఏరో మోడలింగ్ గురించి ఇంటర్నెట్‌లో వెదికా. దిల్లీలో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ అధికారులు నడుపుతున్న ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ఏరో మోడలింగ్ కోర్సు చేశా. ఆ తర్వాత సొంతంగా ఏరో మోడల్స్ తయారీ మొదలుపెట్టా’ అని యద్వీందర్ వివరించారు.
ఎకరా పొలంలో రన్‌వే..
యద్వీందర్ తాను రూపొందించే విమానాల కోసం సొంత పొలంలో ఎకరా జాగా కేటాయించి రన్‌వే సిద్ధం చేశారు. అక్కడే వర్క్‌షాపు, ఏరో మోడలింగ్ ప్రయోగశాల ఏర్పాటు చేసుకున్నారు. పలు రకాల రిమోట్ పైలటింగ్ విమానాలు తయారుచేస్తూ పొలంలోనే ఎగురవేయడం మొదలుపెట్టారు. ఈయన రూపొందించిన సి-130 హెర్కులెస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చేతితో రూపొందించిన అతిపెద్ద మోడల్‌గా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గత ఆగస్టులో గుర్తించింది. సుఖోయ్ జెట్ విమానాలు సైతం రూపొందించిన యద్వీందర్ ఇపుడు 12 అడుగుల పొడవు రెక్కలు గల ఆంటొనవ్-ఏఎన్ 225 మోడల్ రవాణా విమానం తయారీలో నిమగ్నమై ఉన్నారు. డీజీసీఏ (పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్) మార్గదర్శకాలకు అనుగుణంగానే విమానాలు రూపొందించి, పరిమిత ఎత్తులో ఎగురవేస్తున్నట్లు ఆయన తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: ఐపీఎల్ 2023.. ప్రారంభోత్సవంలో తమన్నా సందడి!
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..