మథురలో మత వివాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీద్‌ ఈద్గా వద్ద హనుమాన్‌ చాలీసా పఠించేందుకు వెళ్తున్న ‘అఖిల భారత హిందూ మహాసభ’ నాయకుడు సౌరభ్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Dec 2022 05:30 IST

హిందూ మహాసభ నేత అరెస్టు

మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో మంగళవారం ఉద్రిక్తత తలెత్తింది. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని ఆనుకుని ఉన్న షాహీ మసీద్‌ ఈద్గా వద్ద హనుమాన్‌ చాలీసా పఠించేందుకు వెళ్తున్న ‘అఖిల భారత హిందూ మహాసభ’ నాయకుడు సౌరభ్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. దీంతోపాటు 40 మంది హిందుత్వ కార్యకర్తలను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఎనిమిది మంది నేతల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. బాబ్రీ మసీదు కూల్చివేసి 30 ఏళ్లైన సందర్భంగా ఈ మసీదులో హనుమాన్‌ చాలీసా పఠించేందుకు రావాలని ఈ సంస్థ పిలుపునిచ్చింది. ఏ ఒక్కరూ ఈద్గా వద్దకు చేరుకోలేకపోయారనీ, అరెస్టయిన వారిని వ్యక్తిగత బాండుపై విడుదల చేశామని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని