Gaza: మీడియా భవనంపై ఇజ్రాయెల్‌ దాడి

ఇజ్రాయెల్‌ మిలటరీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాసిటీలోని ప్రధాన మీడియా సంస్థలు కొలువుదీరిన భవనంపై క్షిపణ......

Published : 16 May 2021 00:26 IST

దాడికి ముందు హెచ్చరిక

కళ్లముందే కుప్పకూలిన 12 అంతస్తుల భవనం

గాజాసిటీ: ఇజ్రాయెల్‌ మిలటరీ, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాసిటీలోని విదేశీ మీడియా సంస్థలు కొలువుదీరిన భవనంపై క్షిపణి దాడికి పాల్పడ్డాయి. దాడికి ముందే హెచ్చరికలు చేయడంతో భవనాన్ని అందులోని సిబ్బంది ఖాళీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. హెచ్చరికలు చేసిన గంట వ్యవధిలోనే క్షిపణితో ఇజ్రాయెల్‌ సేనలు దాడికి తెగబడ్డాయి.

ఈ భవనంలో అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ అసోసియేట్‌ ప్రెస్‌, అల్‌ జజీరా, ఇతర మీడియా సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 12 అంతస్థుల భవనంలో సాధారణ పౌరులు కూడా ఉన్నారు. సదరు భవనం యజమానికి ఇజ్రాయెల్‌ మిలటరీ ముందుగానే హెచ్చరికలు జారీచేయడంతో అందులోని వారంతా భవనాన్ని ఖాళీ చేశారు. అక్కడికి కాసేపటికే భారీ భవనం క్షిపణిదాడిలో కుప్పకూలిపోయింది. భవనం కూల్చడానికి గల కారణాన్ని ఇజ్రాయెల్‌ సేనలు వెల్లడించనప్పటికీ.. ఆ ప్రాంతం నుంచి వార్తలు రాకూడదన్న ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య జరిగిన రాకెట్‌ దాడుల్లో గాజా సిటీలో 139 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 39 మంది చిన్నారులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్‌లో వైపు 8 మంది ఈ దాడుల్లో మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని