లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన భర్త.. జైపుర్‌ మేయర్‌పై వేటు

భర్త లంచం తీసుకుంటూ పట్టుబడటంతో జైపుర్‌ మేయర్‌పై రాజస్థాన్‌ ప్రభుత్వం వేటు వేసింది.

Published : 06 Aug 2023 11:03 IST

(photo source: jankalyanfile.rajasthan.gov.in)

ఇంటర్నెట్‌డెస్క్‌: జైపుర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌(Jaipur Heritage Municipal Corporation)పై రాజస్థాన్‌ ప్రభుత్వం వేటువేసింది. ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో ఆమె భర్త లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఆమెను కూడా సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు నంబర్‌ 43 కార్పొరేటర్‌ పదవి నుంచి కూడా సస్పెండ్‌ చేసింది. 

జాబిల్లి సిగలోకి చంద్రయాన్‌-3!

మేయర్‌ మునేశ్‌ గుర్జార్‌ భర్త సుశీల్‌.. ఓ భూమి లీజ్‌ వ్యవహారంలో రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీకి దొరికిపోయాడు. మేయర్‌ స్వగృహంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో మేయర్‌ అక్కడే ఉన్నారు. ఆ ఇంటి నుంచి ఏసీబీ అధికారులు రూ.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. లంచం వ్యవహారంలో మేయర్‌ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఆమెపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో మరో ఇద్దరిని కూడా ఏసీబీ అరెస్టు చేసి విచారిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్‌పై ప్రతిపక్ష భాజపా విరుచుకుపడింది. ఇది దోపిడీ, అబద్ధాల ప్రభుత్వమని మండిపడింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని