Anand Mahindra: అచ్చం తనలాంటి వ్యక్తి.. మహీంద్రా రియాక్షన్‌ ఇదే..!

ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు.. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటోంది. 

Published : 14 Nov 2023 13:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో చురుగ్గా ఉంటారు. నెటిజన్లు చేసే పోస్టులకు తనదైన శైలిలో సరదాగా బదులిస్తుంటారు. తాజాగా తనను పోలిన వ్యక్తి గురించి ఓ నెటిజన్ చెప్పగా.. దానికి మహీంద్రా ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంటోంది. 

ఓ నెటిజన్‌ మహీంద్రాను పోలి ఉన్నటువంటి వ్యక్తి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసి.. ‘ఈ వ్యక్తిని చూసిన తర్వాత మహీంద్రా కూడా షాక్‌ అవుతారు. అతడు నా సహోద్యోగి’ అని రాసుకొచ్చారు. దానికి మహీంద్రా ఫన్నీ సమాధానం ఇచ్చారు. ‘మా చిన్నతనంలో ఏదో మేళాలో మేం విడిపోయినట్టున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సంభాషణలపై నెటిజన్ల నుంచి వెంటనే స్పందన వచ్చింది. ‘ఏకరూప కవలలు’, ‘మీరిద్దరు కలుసుకోవాల్సిన సమయం ఇది’ అని పోస్టులు పెట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని