Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం.. వారణాసిలో ప్రారంభించిన మోదీ

తన సొంత నియోజకవర్గం వారణాసి(Varanasi) పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(Modi).. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. 

Updated : 18 Dec 2023 15:49 IST

వారణాసి: ప్రధాని మోదీ(Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా తన నియోజకవర్గం వారణాసి(Varanasi)లో ఉన్నారు. దీనిలో భాగంగా సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని( Swarved Mahamandir) ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ కేంద్రాన్ని పరిశీలించారు. ఒకేసారి 20వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ గడిపే ప్రతిక్షణం అద్భుతంగా ఉంటుంది. కాశీ నాకెప్పుడూ సొంతింటికొచ్చిన అనుభూతినిస్తుంది. సాధువుల మార్గదర్శకత్వంలో జరిగిన నూతన నిర్మాణాలు, అభివృద్ధి విషయంలో కాశీ ప్రజలు సరికొత్త రికార్డులు సృష్టించారు. అందుకు ఈ మహామందిరం ఓ నిదర్శనం’ అని మోదీ(Modi) వెల్లడించారు.

మూడోసారీ ప్రధాని నేనే.. భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేది మేమే

కృత్రిమ మేధతో మోదీ ప్రసంగం అనువాదం..

ఇక ఆదివారం సాయంత్రం నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం (Kashi Tamil Sangamam) రెండో ఎడిషన్‌ను ప్రధాని ప్రారంభించారు. దీనిలో భాగంగా డిసెంబర్‌ 17-30 మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తమిళనాడు నుంచి వందల సంఖ్యలో ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగాన్ని కృత్రిమ మేధ సాయంతో అనువదించారు. ‘తమిళనాడు నుంచి వచ్చిన వారంతా ఇయర్‌ ఫోన్స్‌ ధరించాలని కోరుతున్నాను. ఈ సాంకేతికత నా హిందీ ప్రసంగాన్ని తమిళంలో అనువదిస్తుంది. ఇది నాకు తొలి అనుభవం’ అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువకావడానికి ఈ సాంకేతికత ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాశీ తమిళ సంగమం ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు