G20 Summit: భారత్‌ మండపానికి చేరుకొంటున్న అగ్రనేతలు.. స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ..

జీ20 ప్రధాన వేదికైన భారత్‌ మండపానికి అతిథుల రాక మొదలైంది. ప్రధాని అందరికంటే ముందుగా వేదిక వద్దకు చేరుకొని అతిథులకు స్వాగతం పలుకుతున్నారు.

Updated : 09 Sep 2023 10:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రధాన వేదికైన భారత్‌ మండపం అతిథుల రాకతో సందడిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తొలుత మండపానికి చేరుకొన్నారు. ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ ధోబాల్‌ స్వాగతం పలికారు. సదస్సు షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో విదేశీ అగ్రనేతలు చేరుకొంటారు. వీరికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలుకుతున్నారు. ఆస్ట్రేలియా, కెనడా ప్రధానులు, ఐరోపా సమాఖ్య చీఫ్‌ ఇప్పటికే మండపానికి చేరుకొన్నారు.

మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విదేశీ అగ్రనేతలకు స్వాగతం చెబుతూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. ‘‘జీ20 సభ్య దేశాధినేతలకు, అతిథి దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు దిల్లీలో జరుగుతున్న 18వ జీ20 సదస్సుకు స్వాగతం’’ అని పేర్కొన్నారు.

* జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు భారత్‌కు అగ్రనేతల రాక కొనసాగుతోంది. నేటి ఉదయం జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ భారత్‌ చేరుకొన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ ఎదురెళ్లి స్వాగతం పలికారు.

* శనివారం ఉదయం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ భారత్‌ చేరుకొన్నారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఆయనకు స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని