Joshimath: జోషీమఠ్ కుంగుబాటు: ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడిన ప్రధాని
జోషీమఠ్ (Joshimath)లోని పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అడిగి తెలుసుకొన్నారు. ఆ ప్రాంతాన్ని కాపాడటానికి వీలైనంత సాయం చేస్తామన్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్(Joshimath)లో వందల సంఖ్యలో ఇళ్లు కుంగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)స్పందించారు. నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామితో ఆయన మాట్లాడారు. ఆ రాష్ట్రానికి సాధ్యమైనంత సాయం చేస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. దీనిపై ధామి మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీ టెలిఫోన్‌లో మాట్లాడారు. జోషీమఠ్(Joshimath)లో పరిస్థితిని.. పునరావాసం, రక్షణ చర్యలను చర్యలను అడిగి తీసుకొన్నారు. జోషీమఠ్(Joshimath)లో విశ్లేషిస్తున్నారు. పర్వతాలపై ఉండి ప్రమాదకర పరిస్థితికి చేరుకొన్నా నగరాల గురించి చర్చించుకొన్నాం. జోషీమఠ్ (Joshimath)ను కాపాడేందుకు వీలైనంత సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.
మరోవైపు జోషీమఠ్ (Joshimath)పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించేందుకు ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్ర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో క్యాబినెట్ సెక్రెటరీ, ప్రభుత్వ సీనియర్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ సభ్యలు పాల్గొననున్నారు. జోషీమఠ్ (Joshimath)జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ రాష్ట్ర సీనియర్ అధికారులు కూడా వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొననున్నారు.
జోషీమఠ్(Joshimath) హిమాలయా సానువుల్లో ఓ చిన్న పట్టణం. బద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన తర్వాత బద్రీనాథుడి విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తారు. సైనికులకు, హిమాలయ యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఇదే బేస్ క్యాంప్. బద్రీనాథ్ సందర్శనకు వెళ్లే భక్తుల్లో చాలామంది రాత్రి ఇక్కడే బస చేస్తారు. భారత సైనిక దళాలకు ఇదో వ్యూహాత్మక పట్టణం. ధౌలిగంగా, అలకానంద నదుల సంగమ స్థానమైన విష్ణుప్రయాగకు చేరువలో ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!