Modi: హౌస్‌కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

ఝార్ఖండ్‌లో భారీ మొత్తంలో వెలుగుచూసిన నగదుపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు. 

Published : 06 May 2024 17:43 IST

దిల్లీ: లెక్కల్లో చూపని రూ.25 కోట్ల నోట్ల కట్టలు ఒక హౌస్‌ కీపర్ ఇంట్లో వెలుగుచూడటం సంచలనం సృష్టిస్తోంది. ఝార్ఖండ్ మంత్రి అలంఘీర్‌ ఆలం (Alamgir Alam) సహాయకుడు సంజీవ్‌లాల్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద ఇంత డబ్బు దొరకడం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రధాని మోదీ (Modi) స్పందించారు.(Jharkhand Cash Recovery)

‘‘ఝార్ఖండ్‌లో ఈ రోజు నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతడు దొంగతనం చేశాడని, ఆ డబ్బు మోదీ తీసుకెళ్లిపోయాడని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు చెప్పండి.. నేను వారి దోపిడీని ఆపితే..వారు నన్ను తిడతారు కదా?మరి నేను ఆ పని చేయాలా? వద్దా?’’ అని ఒడిశా ఎన్నికల ప్రచార సభలో మోదీ తన మద్దతుదారుల్ని ప్రశ్నించారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా సోమవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో హౌస్‌కీపర్ ఇంట్లో దొరికిన సొమ్ము రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. దానిని లెక్కించేందుకు బ్యాంకు అధికారుల్ని రప్పించినట్లు, భద్రత నిమిత్తం పారామిలిటరీ బలగాలను మోహరించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్‌ ..?

ఇంట్లో పనిచేసే వ్యక్తి వద్ద ఇంత సొమ్ము ఉండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇదిలాఉంటే.. సంజీవ్‌కు పది మంది మంత్రుల వద్ద పనిచేసిన అనుభవం ఉంది. ఆ ‘అనుభవం’ ఆధారంగానే అలంఘీర్‌ ఆయన్ను నియమించుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని