Rahul Gandhi: హరియాణాలో వరినాట్లు వేసిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం ఓ పొలంలో దిగి వరినాట్లు వేశారు. దిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్తున్న ఆయన అకస్మాత్తుగా హరియాణాలోని సోనీపత్‌ జిల్లా మదిన గ్రామంలో ఆగారు.

Published : 08 Jul 2023 23:05 IST

చండీగఢ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం ఓ పొలంలో దిగి వరినాట్లు వేశారు. దిల్లీ నుంచి హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్తున్న ఆయన అకస్మాత్తుగా హరియాణాలోని సోనీపత్‌ జిల్లా మదిన గ్రామంలో ఆగారు. ఆశ్చర్యంగా తనను చూస్తున్న స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలంలో ట్రాక్టర్‌ నడిపారు. ప్యాంటు మడతపెట్టి, బూట్లు చేతిలో పట్టుకుని బురదలో దిగారు. రైతులతో కలిసి వరినాట్లు వేశారు. మహిళా కూలీలు తమతోపాటు తెచ్చుకున్న భోజనాన్ని ఆయనకూ వడ్డించారు. వారితో కలిసి ఆయన భోజనం చేసిన ఫొటోలను కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రణదీప్‌ సూర్జేవాలా, దీపేందర్‌ సింగ్‌ హుడాలు కూడా తమ ట్విటర్‌ ఖాతాలలో రాహుల్‌ గాంధీ పర్యటన ఫొటోలను పంచుకున్నారు. ఆయన దాదాపు రెండు గంటలు ఆ గ్రామంలోనే ఉన్నారని హుడా తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని