₹4.50 జీఎస్టీ వసూలు చేసినందుకు ₹20వేల జరిమానా

హరియాణాలోని పంచకుల జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీర్పునిచ్చింది

Published : 10 Jul 2021 22:30 IST

దిల్లీ: ఓ వినియోగదారుడి నుంచి ₹4.50 అదనంగా వసూలు చేసినందుకు ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీకి ₹20 వేలు జరిమానా పడింది. మూడేళ్ల క్రితం నాటి కేసులో తాజాగా తీర్పు వెలువడింది. 2018లో హరియాణాకు చెందిన అభిషేక్‌ ₹144 విలువచేసే చీజ్‌ గార్లిక్‌ స్టిక్‌తో పాటు ₹90 విలువచేసే మూడు కూల్ డ్రింక్స్‌ను స్విగ్గీ యాప్‌లో ఆర్డర్ పెట్టారు. ఇందులో స్విగ్గీ కూల్‌డ్రింక్స్‌పై అదనంగా ₹4.50 జీఎస్టీ వసూలు చేసింది. కూల్‌డ్రింక్స్‌కు ఎమ్మార్పీ ధర ₹90 చెల్లిస్తున్నా.. జీఎస్టీ పేరుతో అక్రమంగా ఎందుకు నాలుగున్నర రూపాయలు వసూలు చేస్తున్నారని అభిషేక్‌  ప్రశ్నిస్తూ స్విగ్గీపై కేసు వేశారు. హరియాణాలోని పంచకుల జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తాజాగా ఈ అంశంపై తీర్పునిచ్చింది.

అదనంగా జీఎస్టీ ₹4.50 వసూలు చేసిన కారణంగా రూ.20వేలు జరిమానా చెల్లించాలని స్విగ్గీని ఆదేశించింది. మానసిక వేదనకు గురిచేసినందుకు జరిమానాలో సగం రూ.10వేలు అభిషేక్‌కు, మరో సగం హరియాణా రాష్ర్ట శిశు సంక్షేమ కౌన్సిల్‌కు చెల్లించాలని పేర్కొంది. దీనిపై స్విగ్గీ సంస్థ స్పందిస్తూ.. తమ సేవల్లో ఎలాంటి లోపమూ లేదనని పేర్కొంది. తాము కేవలం మధ్యవర్తినని, డబ్బును స్విగ్గీనే వసూలు చేసినప్పటికీ.. వ్యాపారే బిల్లు, ట్యాక్సును వసూలు చేస్తారని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని