Bangladesh: పెళ్లి బృందంపై పిడుగులు. 17 మంది దుర్మరణం

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల కోసం వెళ్తున్న వరుడి బృందంపై పిడుగులు పడి 17 మంది దుర్మరణం చెందారు. మరో 15

Published : 04 Aug 2021 23:39 IST

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల కోసం వెళ్తున్న వరుడి బృందంపై పిడుగులు పడి 17 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఢాకాలోని చపైనవాబ్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

చపైనవాజ్‌గంజ్‌ ప్రాంతం నుంచి బుధవారం మధ్యాహ్నం ఓ పెళ్లి బృందం బోటులో శిబ్‌గంజ్‌ ప్రాంతంలోని పంకాకు బయల్దేరింది. ఈ బృందం పద్మా నదిని దాటుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీంతో ఆ బృందం ఫెర్రీఘాట్‌ వద్ద బోట్‌ను నిలిపి ఒడ్డునే ఉన్న షెడ్డు కిందకు వెళ్లింది. అదే సమయంలో పిడుగులు పడటంతో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారమందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వరుడు కూడా గాయపడ్డాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు