Modi Us Visit: కమలకు తాతయ్య జ్ఞాపకాన్ని అందజేసిన మోదీ..!

ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన కలుసుకున్న అధినేతలు, ప్రముఖులకు ఆకట్టుకునే బహుమతులు ఇస్తుంటారు. భారత్ ఔన్నత్యం, పర్యటన సారం ప్రతిబింబించే వాటిని అందిస్తుంటారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అమూల్యమైన బహుమతులు ఇచ్చి, ఆశ్చర్యపర్చారు. అందులో ఆమె పూర్వీకులకు సంబంధించినవి కూడా ఉన్నాయి.  

Updated : 24 Sep 2021 18:18 IST

ప్రపంచ నేతలకు ఆకట్టుకునే బహుమతులు ఇచ్చిన ప్రధాని

వాషింగ్టన్‌: ప్రధాని నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్లినా.. ఆయన కలుసుకున్న అధినేతలు, ప్రముఖులకు ఆకట్టుకునే బహుమతులు ఇస్తుంటారు. భారత్ ఔన్నత్యం, పర్యటన సారం ప్రతిబింబించే వాటిని అందిస్తుంటారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మోదీ.. భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అమూల్యమైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపర్చారు. అందులో ఆమె పూర్వీకులకు సంబంధించినవి కూడా ఉన్నాయి.

మోదీ తన నియోజకవర్గమైన కాశీకి చెందిన కళాత్మక వస్తువును కమలకు అందించారు. అది గులాబీ మీనాకారి చదరంగం సెట్. దాంట్లోని ప్రతి పావు అద్భుతమైన హస్తకళతో రూపొందింది. అవి కాశీ విశిష్టతను ప్రతిబింబించేలా ఉన్నాయి. అలాగే తమిళనాడుకు చెందిన ఆమె తాతయ్య పీవీ గోపాలన్‌కు సంబంధించిన నోటిషికేషన్ కాపీను హస్తకళ ఫ్రేమ్‌లో అందజేశారు. గోపాలన్‌ ప్రభుత్వ ఉద్యోగిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు కూడా వెండి గులాబీ మీనాకారి నౌకను బహూకరించారు. అది కూడా కాశీ గొప్పతనాన్ని వెల్లడిచేసేదే. ఇక జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధం చెక్కతో చేసిన బుద్ధుడి ప్రతిమను అందజేశారు. బుద్ధిజం ఇరు దేశాలను దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని బుధవారం అమెరికా చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం కమలా హారిస్‌తో వివిధ అంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని