అధికార అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ రక్షించలేదు: జస్టిస్‌ ఎన్వీ రమణ

అధికారులు, పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ

Updated : 07 Dec 2022 22:18 IST

దిల్లీ: దేశంలో అధికారులు, పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ అండతో చెలరేగిపోయే పోలీసులను న్యాయవ్యవస్థ రక్షించలేదని స్పష్టంచేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. కోర్టులను ఆశ్రయించడం కొందరు అధికారులకు అలవాటుగా మారిందన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అదనపు డీజీపీ గుర్జిందర్‌ పాల్‌ సింగ్‌ తనపై నమోదైన క్రిమినల్‌ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. అయితే, ప్రస్తుతానికి స్థాయీ సంఘం ఏర్పాటుపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని