Viral Video: వెంట్రుకవాసిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్‌

రైలు ప్రమాదం నుంచి ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో బయటపడిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 23 Nov 2023 17:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రైలు ప్రమాదం నుంచి ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. పట్టాలు దాటడంలో రెప్పపాటు ఆలస్యం జరిగినా అతడి ప్రాణాలు పోయేవే!  ఓ వ్యక్తి పట్టాలు దాటి ప్లాట్‌ఫాం పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వందే భారత్‌ రైలు వేగంగా దూసుకొచ్చింది. అదే సమయంలో అతడు క్షణాల్లోనే ప్లాట్‌ఫాంపైకి ఎక్కడంతో అదృష్టవశాత్తు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) అధికారులు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. కాకపోతే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. జీవితమనేది వన్‌టైం జర్నీ. . రెండో ఛాన్స్‌ తీసుకునేందుకు రివైండ్‌ బటన్‌ ఏమీ ఉండదు. ట్రాక్‌ల నుంచి దూరంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. బాధ్యతతో మెలగండి’’ అని ఆర్‌పీఎఫ్‌ పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు