Assam: ఈశాన్య రాష్ట్రంలో కీలక పరిణామం.. ULFAతో కేంద్ర, రాష్ట్రాల త్రైపాక్షిక ఒప్పందం

సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం’ (ఉల్ఫా)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఓ త్రైపాక్షిక మధ్య శాంతి ఒప్పందం (Peace Accord) జరిగింది.

Published : 29 Dec 2023 20:02 IST

దిల్లీ: అస్సాంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు జరుగుతోన్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అస్సాంకు చెందిన సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం’ (ఉల్ఫా)తో దీర్ఘకాలంగా జరిపిన చర్చలు ఫలించాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం (Peace Accord)పై శుక్రవారం సంతకాలు జరిగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు యూఎల్‌ఎఫ్‌ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం అస్సాంలో దశాబ్దాల తిరుగుబాటు చర్యలకు తెరదించుతుందని భావిస్తున్నారు.

‘ప్రత్యేక అస్సాం’ డిమాండుతో 1979లో ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ULFA)’ ఏర్పాటైంది. తిరుగుబాటు పేరుతో ఆయుధాలను చేతపట్టిన ఆందోళనకారులు అనేక విధ్వంస చర్యలకు పాల్పడటం మొదలుపెట్టారు.  1990లో దీన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలో శాంతి చర్చలకు సుదీర్ఘ ప్రయత్నాలు జరిగాయి. అరబింద రాజ్‌ఖోవా సారథ్యంలోని ఉల్ఫా బృందం ఈ చర్చలకు 2011లో తొలిసారి ముందుకు వచ్చింది. అయితే, పరేశ్‌ బరుహా నేతృత్వంలోని ఉల్ఫా (స్వతంత్ర) వర్గం మాత్రం తాజా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం పరేశ్‌ ..చైనా-మయన్మార్‌ సరిద్దులో తలదాచుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని