Sonia Gandhi: రామమందిర ప్రారంభోత్సవానికి సోనియాగాంధీ వెళ్తున్నారా..?

వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో శ్రీరామ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరు గురించి పార్టీ స్పందించింది.  

Updated : 29 Dec 2023 18:48 IST

దిల్లీ: అయోధ్య(Ayodhya)లో రామ మందిర ప్రారంభోత్సవానికి(Ram temple consecration) కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) హాజరుకానున్నట్లు జాతీయ మీడియా కథనాలు రాసుకొచ్చాయి. ఆమెతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరికీ ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు హాజరవుతారని వార్తలు వస్తున్నప్పటికీ.. దీనిపై తగిన సమయంలో నిర్ణయం ప్రకటిస్తామని జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ అంశంపై మిత్ర పక్షాలతో చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. జనవరి 22న జరగనున్న ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా 6 వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే తనకు ఆహ్వానం అందలేదని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్(Sharad Pawar) ఇదివరకు మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. మరోపక్క, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా హాజరుకావడం లేదని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది.

‘ ‘రామ మందిర’ ప్రారంభోత్సవం.. అయోధ్యకు 1000 రైళ్లు..!’

ఇదిలా ఉంటే.. శనివారం ప్రధాని మోదీ(Modi) అయోధ్యకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా రూ.11,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం, ఆధునికీకరించిన రైల్వే స్టేషన్‌, రెండు నూతన అమృత్‌ భారత్‌, ఆరు వందే భారత్‌ రైళ్లను ఆరంభించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని