యాపిల్‌ ఫేస్‌మాస్క్‌: ఉద్యోగులకు మాత్రమే

కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలు చేయడంతో ఉత్పత్తి లేక పలు పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించాయి. వ్యాపార సంస్థలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ కొద్ది మంది సిబ్బందితో.....

Updated : 21 Sep 2020 11:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా లాక్‌డౌన్ అమలు చేయడంతో ఉత్పత్తి లేక పలు పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని సూచించాయి. వ్యాపార సంస్థలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తూ కొద్ది మంది సిబ్బందితో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ సిబ్బందిని వైరస్‌ బారి నుంచి రక్షించుకునేందుకు పలు కంపెనీలు మాస్క్‌లు, శానిటైజర్లతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలను ఉద్యోగులకు ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టెక్‌ దిగ్గజం యాపిల్ ప్రత్యేకమైన మాస్క్‌లను రూపొందించింది. కొవిడ్‌-19 నియంత్రణలో భాగంగా వీటిని తమ కంపెనీలోని కార్పొరేట్, రిటైల్‌ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు అందజేసింది. యాపిల్ ప్రతిష్టాత్మక ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐపాడ్‌లు డిజైన్‌ చేసిన బృందం వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిని తొలుత కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న క్యూపర్టినో అనే టెక్నాలజీ కంపెనీ ఉద్యోగుల కోసం యాపిల్ తయారుచేసింది.

యాపిల్ రూపొందించి ఈ మాస్క్‌లలో మొత్తం మూడు పొరలు ఉంటాయి. దీన్ని ధరించినప్పుడు ముక్కు, నోటి కింది భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా డిజైన్‌ చేశారు. గాలిని ఫిల్టర్‌ చేసే ప్రత్యేకమైన బట్టతో వీటిని రూపొందించారు. ఇందుకోసం ఎలాంటి బట్ట సరిపోతుందనే దానిపై కంపెనీ విస్తృత పరిశోధన చేసినట్లు యాపిల్ తెలిపింది. ఈ మాస్క్‌ను ఐదు సార్లు వరకు ఉతికి తిరిగి ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు యాపిల్ క్లియర్‌మాస్క్ అనే మరో మాస్క్‌ను తయారుచేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఈ సర్జికల్ మాస్క్ ధరించిన వారి ముఖం క్లియర్‌గా అవతలి వారికి కనిపిస్తుంది. దీని వల్ల వినికిడి లోపం ఉన్నవారితో ముఖ కవళికల ద్వారా మాట్లాడేందుకు సౌకర్యంగా ఉంటుందని యాపిల్ తెలిపింది. అయితే వీటిని త్వరలోనే మార్కెట్లో సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని