Bachchan Pandey: అన్న కాదు గాడ్‌ఫాదర్‌

తనను ఇలాగే పిలవాలంటున్నారు అక్షయ్‌కుమార్‌. ఎందుకు? ఏంటి? తెలియాలంటే ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రం చూడాల్సిందే. ఇప్పటివరకూ పలు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించిన....

Updated : 16 Feb 2022 08:57 IST

నను ఇలాగే పిలవాలంటున్నారు అక్షయ్‌కుమార్‌. ఎందుకు? ఏంటి? తెలియాలంటే ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘బచ్చన్‌పాండే’ చిత్రం చూడాల్సిందే. ఇప్పటివరకూ పలు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన నుంచి వస్తోన్న మరో విభిన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘బచ్చన్‌ పాండే’. కృతి సనన్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు అక్షయ్‌. ‘పెయింట్‌ షాపులో ఉండే రంగుల షేడ్స్‌ కంటే ఎక్కువ షేడ్స్‌ ఈ పాత్రలో ఉంటాయి. బచ్చన్‌ పాండే భయపెడతాడు, నవ్విస్తాడు...ఇలా ప్రతి దానికి మీరు సిద్ధంగా ఉండండి’’అని రాశారు అక్షయ్‌. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని