Rashmika: ‘యానిమల్’ కోసం రష్మిక?
హిందీలో వరుసగా అవకాశాలు అందుకొంటోంది రష్మిక మందన్న. ఆమె నటించిన హిందీ సినిమాలు విడుదల కాక ముందే ‘పుష్ప’తో ఆమె పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఉత్తరాది
హిందీలో వరుసగా అవకాశాలు అందుకొంటోంది రష్మిక మందన్న. ఆమె నటించిన హిందీ సినిమాలు విడుదల కాక ముందే ‘పుష్ప’తో ఆమె పాన్ ఇండియా హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు శ్రీవల్లిగా ప్రేక్షకులకు సుపరిచితమైంది. దాంతో మరిన్ని హిందీ చిత్రాలు ఆమె తలుపు తడుతున్నాయి. రణబీర్ కపూర్ కథానాయకుడిగా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ‘యానిమల్’ కోసం రష్మికని సంప్రదించినట్టు తెలిసింది. తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రమిది. ఇందులో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడేందుకు రష్మిక మందన్నని సంప్రదించినట్టు తెలిసింది. మరి ఆమె నిర్ణయం ఏమిటనేది బయటికి రాలేదు. హిందీలో ఎన్ని అవకాశాలు వచ్చినా దక్షిణాది పరిశ్రమని వదలకుండా సినిమాలు చేస్తోంది రష్మిక. ఇటీవలే ఆమె ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో నటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్‌లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం