అది ఐశ్వర్య గొప్పతనమే!

ఆరాధ్య.. ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ల ముద్దుల కూతురు. ఇప్పుడు ఈమె బుల్లి సెలబ్రిటీనే. అమ్మతోపాటు కొన్ని ఫ్యాషన్‌ షోల్లో కూడా సందడి చేసింది. అందరూ సినిమా నటులే ఉన్న కుటుంబంలో...

Published : 12 Apr 2021 11:26 IST

ముంబయి: ఆరాధ్య.. ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ల ముద్దుల కూతురు. ఇప్పుడు ఈమె బుల్లి సెలబ్రిటీనే. అమ్మతోపాటు కొన్ని ఫ్యాషన్‌ షోల్లో కూడా సందడి చేసింది. అందరూ సినిమా నటులే ఉన్న కుటుంబంలో పుట్టినా ఎక్కడా గర్వం లేకుండా పద్ధతిగా పెంచుతోందట ఐశ్వర్య. ఈ విషయాన్ని అభిషేక్‌ ఓ ఇంటర్వ్యూలో ముచ్చటించాడు.  ‘‘తాను పుట్టింది సినిమా కుటుంబంలో అనే విషయం ఆరాధ్యకు బాగా తెలుసు. తాత అమితాబ్‌బచ్చన్‌, నాయనమ్మ జయాబచ్చన్‌లు ఎంత పెద్ద స్టార్‌లో తనకు తెలుసు. ఇలాంటి కుటుంబంలో పుట్టడం చాలా గొప్పగా భావిస్తుంటుంది.    ఇతరుల్ని గౌరవించడం ఎలాగో ఆరాధ్యకు బాగా తెలుసు. వాళ్ల అమ్మ అదంతా ఎంతో చక్కగా నేర్పింది. మేము నటించిన అన్ని చిత్రాలు చూసి ఆనందిస్తుంటుంది ఆరాధ్య. తన ప్రవర్తన అంత బాగుంటుందంటే అది ఐశ్వర్య గొప్పతనం’’అని చెప్పాడు అభిషేక్‌. ఆయన నటించిన ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని