Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ లిప్ కిస్.. చుట్టుముట్టిన ట్రోల్స్
సోషల్‌మీడియా వేదికగా నెగటివ్ కామెంట్స్‌ను ఎదుర్కొంటున్నారు నటి ఐశ్యర్యారాయ్. ఐశ్వర్య చేసిన ఓ పనిని పలువురు నెటిజన్లు తప్పుబడుతూ విమర్శలు చేస్తున్నారు.
ముంబయి: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ను (Aishwarya Rai Bachchan) సోషల్‌మీడియాలో ట్రోల్స్ చుట్టుముట్టాయి. కుమార్తె ఆరాధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని పలువురు సోషల్‌మీడియా యూజర్స్ తప్పుబడుతున్నారు. మీరు కూడా ఇలా చేస్తారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమెపై వాళ్లు ఇంతగా ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమిటంటే..
ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య పుట్టినరోజు నేడు. తన గారాల బిడ్డకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఐష్‌ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య’’ అని పేర్కొంటూ కుమార్తెతో దిగిన ఓ ఫొటోని షేర్ చేశారు. ఇందులో ఆమె ఆరాధ్యకు లిప్ కిస్ ఇస్తూ కనిపించారు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఐష్‌ని విమర్శిస్తున్నారు. ‘‘చిన్నారిని పెదవులపై ముద్దుపెట్టుకోవడం వింతగా ఉంది’’, ‘‘మేడమ్.. ఇలాంటివి చేసి మీరు ఇతరుల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం లేదు’’ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిలా ఉండగా మరి కొంతమంది అభిమానులు మాత్రం.. ఈ ఫొటోలో తప్పు ఏముంది? అని ఎదురు ప్రశ్నలు విసురుతున్నారు. ‘‘తల్లీకుమార్తెల మధ్య అనుబంధాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ కామెంట్స్ జత చేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్