Saif Alikhan: సైఫ్‌కు అక్షయ్‌ హెచ్చరిక

బాలీవుడ్‌ క్రేజీ జోడీల్లో సైఫ్‌ అలీఖాన్‌, కరీనాకపూర్‌ జంట ముందు వరసలోనే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు సంతానంతో హాయిగా గడిపేస్తున్నారు. ‘తషన్‌’ సినిమా చిత్రీకరణ  సమయంలో కరీనా, సైఫ్‌ ప్రేమలో పడ్డారు.

Updated : 02 Feb 2022 06:51 IST

బాలీవుడ్‌ క్రేజీ జోడీల్లో సైఫ్‌ అలీఖాన్‌, కరీనాకపూర్‌ జంట ముందు వరసలోనే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు సంతానంతో హాయిగా గడిపేస్తున్నారు. ‘తషన్‌’ సినిమా చిత్రీకరణ  సమయంలో కరీనా, సైఫ్‌ ప్రేమలో పడ్డారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ నటించారు. ఈ సినిమా షూటింగులో కరీనాతో సైఫ్‌ సన్నిహితంగా ఉండటం గమనించి కరీనాకు దూరంగా ఉండమని సైఫ్‌కు అక్షయ్‌  చెప్పారట. ఈ జోడీ ప్రేమలో పడిన తొలి రోజుల్లో అక్షయ్‌కుమార్‌, సైఫ్‌ మధ్య జరిగిన ఆసక్తికర విషయాన్ని ఓ ఇంటర్య్వూలో కరీనా పంచుకుంది. ఆ ఇంటర్య్వూ చేసింది అక్షయ్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా కావడం విశేషం. ‘‘నేనూ, సైఫ్‌ సన్నిహితంగా ఉండటం గమనించిన అక్షయ్‌..సైఫ్‌ను ఓ పక్కకు పిలిచి ‘ఈ అమ్మాయిలతో చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఉండు’’ అని హెచ్చరించారు. ‘లేదు...  అలాంటిది ఏమీ లేదు. తన గురించి నాకు బాగా తెలుసు’ అని సైఫ్‌ చెప్పారు’’అని అప్పటి జ్ఞాపకాన్ని పంచుకుంది కరీనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని