Bachchan Pandey: ‘గద్దలకొండ గణేష్‌’ రీమేక్‌ ట్రైలర్‌..!

వరుణ్‌తేజ్‌, అధర్వ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గద్దలకొండ గణేష్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకుంది. కాగా, ఇప్పుడు ఇదే కథతో బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న...

Updated : 18 Feb 2022 16:11 IST

ముంబయి: వరుణ్‌తేజ్‌, అధర్వ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘గద్దలకొండ గణేష్‌’. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా టాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ అందుకుంది. కాగా, ఇప్పుడు ఇదే కథతో బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. ఫర్హద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 18న ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం ‘బచ్చన్‌పాండే’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘బచ్చన్‌పాండే’ అనే రౌడీగా అక్షయ్‌కుమార్‌ ఊరమాస్‌, రఫ్‌ లుక్‌లో భయపెట్టేలా ఉన్నారు. ‘‘మన పవర్‌ తగ్గకూడదంటే ఎదుటివారిలో భయాన్ని సృష్టించాలి’’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక, తమ నేటివిటీకి తగ్గట్లు కథలో కాస్త మార్పులు చేసినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది. తెలుగులో ఆధ్వర్య పోషించిన పాత్రను హిందీలో నటి కృతిసనన్‌ చేశారు. అక్షయ్‌కుమార్‌ ప్రేయసి పాత్రలో నటి జాక్వెలిన్‌ నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని