waltair veerayya: అసలు ‘వాల్తేరు’ పేరెలా వచ్చింది..? చిరంజీవి సినిమాకు ఎందుకు పెట్టారు?
waltair veerayya: వాలు ఎక్కువగా ఉండటం ద్వారా ఈ ప్రాంతానికి పెదవాల్తేరుగా, చిన్నవాలు ప్రాంతానికి చినవాల్తేరుగా పిలుస్తారు. ఇంకా ఈ పేరు వెనుక ఉన్న కథనం ఏంటో తెలుసుకోండి
ఇంటర్నెట్‌డెస్క్: విశాఖపట్నం ఏర్పడక ముందే ఉన్న పురాతన గ్రామాల్లో పెదవాల్తేరు ఒకటి. పూరి గుడిసెలతో ఓ చిన్న గ్రామంగా ఉండేది. డాబాలు, బహుళ అంతస్థులు ఉన్నా, ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలానే అనిపిస్తుంది. వాల్తేరుకు ఒక పక్క లాసన్సుబే కాలనీ, మరో పక్క ఎంవీపీ కాలనీ, ఉషోదయా, ఇందిరానగర్ సరిహద్దులుగా ఉంటాయి. పోలమాంబ అమ్మవారిని ఇక్కడి వారు ఇలవేల్పుగా కొలుస్తారు. ప్రధానంగా పెదవాల్తేరు అనే పేరు రావడానికి కారణం ఈ ప్రాంతం వాలుగా ఉండటం కారణంగా పేరు వచ్చిందని శాస్త్రీయంగా నామకరణం చేశారు. అయితే పక్కనే ఉన్న చిన్నవాల్తేరు వాలు తక్కువగా ఉంటుంది. వాలు ఎక్కువగా ఉండటం ద్వారా ఈ ప్రాంతానికి పెదవాల్తేరుగా, చిన్నవాలు ప్రాంతానికి చినవాల్తేరుగా పిలుస్తారు. దీంతో పాటు మరో కథ కూడా చెబుతున్నారు. ఇద్దరు రజకులు ఉండేవారు. అయితే అన్న ఉండే ప్రాంతానికి పెదవాల్తేరుగా, తమ్ముడు ఉండే ప్రాంతానికి చినవాల్తేరుగా పేరు వచ్చిందని కొంత మంది స్థానికులు చెబుతారు. బ్రిటిష్‌వాళ్లు పరిపాలించే సమయంలో విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు వాల్టైర్గా పేరు ఉండేది. వాల్టైర్ కొన్నాళ్లకు వాల్తేరుగా మారిందట.
మరొక కథనం ప్రకారం..
వాల్తేరు అనేది ప్రజలు తాగేందుకు నీరు ఇచ్చిన సెలయేరుగా చెబుతారు. తూర్పు కనుమల్లో పుట్టిన రెండు పెద్ద నీటి ప్రవాహాలు విశాఖ మీదుగా ప్రవహించేవి. అందులో ఒకటి హనుమంత వాగు. ఇది సింహాచలం కొండల్లో పుట్టి లాసన్స్‌బే వద్ద సముద్రంలో కలిసేది. 1902లో ముడసర్లోవ పార్కు/రిజర్వాయరు నిర్మించిన తరువాత ఈ యేరు కనుమరుగైంది. ఇప్పటి హనుమంతవాక జంక్షన్ ఆ వాగు పేరు మీదుగానే వచ్చిందంటారు. ఇంకొకటి వాలుతేరు/వాలుటేరు. తూర్పు కొండల్లో పుట్టి విశాఖ నగరం మీదుగా 30 కి.మీ. ప్రవహించి, డాల్ఫిన్ నోస్ కొండ వద్ద సముద్రంలో కలిసేది. వాలుగా ప్రవహించే ఏరు (వాలు+ఏరు) వాలుతేరు క్రమంగా వాల్తేరుగా రూపాంతరం చెందిందని అంటారు. వందల ఏళ్ల క్రితమే డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరు ఓడరేవు విదేశీయులకు గమ్యస్థానం. డచ్, ఫ్రెంచ్, బ్రిటీష్ వాళ్ళు ఈ ఓడరేవు తమ సరకులు రవాణా చేసేవారు. 1850 తర్వాత బ్రిటీష్ వాళ్లు సెంట్రల్ ప్రావిన్స్ పోర్ట్, ఈస్ట్‌కోస్ట్ బెటాలియన్, వైజాగ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్, వాల్తేర్ ఈస్ట్ రైల్వేస్టేషన్ ప్రారంభించడంతో బ్రిటీష్ అధికార్ల రాకపోకలు పెరిగాయి. డాల్ఫిన్ నోస్ వద్ద వాల్తేరుకు ప్రాచుర్యం పెరిగింది. ఆంగ్లేయులు వాల్తేరును ‘వాల్టేర్’ అని పలకడం.. Waltairగా రాయడం అలవాటై అదే కొనసాగింది. పూర్వం వాల్తేరు-పెద జాలరిపేట మధ్య ప్రాంతమంతా ఎక్కువగా కొండగుట్టలు మాత్రమే ఉండేవట. వీటిని విస్తరించుకుంటూ రావడంతో రెండు విడిపోయి, పెద వాల్తేరు, చిన వాల్తేరు అయ్యాయి. నగరానికి నీటి అవసరాలు పెరగడంతో 1970లో వాల్తేరుపై మేఘాద్రి గెడ్డ వద్ద జలాశయం నిర్మించారు. దీంతో వాల్తేరు ప్రవాహం నిలిచిపోయింది.
ఇక ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ వెనుక కథ చూద్దాం!
చిరంజీవి కథానాయకుడిగా బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). శ్రుతిహాసన్ కథానాయిక. రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనేటైటిల్ పెట్టడం వెనుక కథను దర్శకుడు బాబీ ఇటీవల వెల్లడించారు. ‘‘వెంకీ మామ’ షూటింగ్ యాగంటిలో జరుగుతున్నప్పుడు నాజర్ గారు ఒక పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు ఆకట్టుకుంది. ఈ టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీంకి చెప్పాను. అలాగే చిరంజీవి గారు ఇండస్ట్రీకి రాకముందు బాపట్లలో ఉన్నారు. అప్పుడు ఆయన నాన్నగారు ఓ హెడ్ కానిస్టేబుల్‌కు రూ.500 ఇచ్చి ఫొటో షూట్ చేయించారు. ఆ ఫొటోలతోనే మద్రాస్ వచ్చానని చిరంజీవి గారు చెప్పారు. ఆ కానిస్టేబుల్ పేరు కూడా వీరయ్య. ఇది చాలా నోస్టాలిజిక్‌గా అనిపించింది. ఇందులో చిరంజీవి పాత్రకు వీరయ్య పేరు అయితే బాగుంటుందని అనిపించింది. ఇది చిరంజీవి గారికి కూడా నచ్చింది. అలా వాల్తేరు వీరయ్య (waltair veerayya)ని లాక్ చేశాం’’ అని బాబీ చెప్పారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి మాస్, యాక్షన్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్‌ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్‌హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్‌తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ