Amitabh Bachchan: షూటింగ్ మొద‌లెట్టారు

 కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్ట‌డంతో కొన్ని నిబంధ‌న‌లతో సినిమా చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ సోమ‌వారం షూటింగ్‌లో పాల్గొన్నారు.

Published : 14 Jun 2021 15:52 IST

ముంబ‌యి: కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కాస్త త‌గ్గ‌ముఖం ప‌ట్ట‌డంతో కొన్ని నిబంధ‌న‌లతో సినిమా చిత్రీక‌ర‌ణ‌లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ముఖ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ సోమ‌వారం షూటింగ్‌లో పాల్గొన్నారు. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మాస్క్ ధ‌రించిన ఫొటోని పంచుకున్నారు. ‘‘స‌మ‌యం ఉద‌యం 7గంట‌లు. ప‌నికోసం వెళ్తున్నాను. లాక్‌డౌన్ 2.O త‌ర్వాత తొలిసారి షూటింగ్‌లో పాల్గొంటున్నాను. రోజురోజుకి ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తున్నాయి’’ అని పేర్కొన్నారు. అయితే అమితాబ్ ఏ సినిమా చిత్రీక‌ర‌ణ‌కి హాజ‌ర‌వుతున్నారో చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో ‘మేడే’, ‘గుడ్ బై’ చిత్రాలున్నాయి. న‌టి నీనా గుప్త సైతం సెట్స్‌లో అడుగుపెట్టారు. ‘‘బ్యాక్ టు షూట్’’ అని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఆమె ‘గుడ్ బై’  చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని