Jaishankar: భారత్‌ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్‌

భారత్‌ ప్రపంచవ్యాప్తంగా స్నేహపూర్వకమైన దేశంగా మాత్రమే కాకుండా శక్తిమంతమైన దేశంగాను పేరు పొందుతుందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు.

Updated : 07 May 2024 20:44 IST

దిల్లీ: భారత్‌ నేడు ప్రపంచదేశాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడమే కాకుండా, శక్తిమంతమైన దేశంగాను ఎదిగిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. దిల్లీ యూనివర్శిటీలోని హన్స్‌రాజ్ కాలేజీలో జరిగిన   ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘వికసిత భారత్ - ది వాయిస్ ఆఫ్ ది యూత్’’ అనే అంశంపై విద్యార్థులతో ముచ్చటించారు. 

వికసిత భారత్‌ ఒక నినాదం మాత్రమే కాదని, గత 10 సంవత్సరాలుగా మనం వేసుకున్న పునాది అని జైశంకర్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్ వంటి దేశాల్లో యుద్ధాల వల్ల ఇబ్బందిపడుతున్న భారత పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకు రావడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. రాబోయే 25 ఏళ్లలో దేశ భవిష్యత్తు పూర్తిగా మారిపోనుందని, అమృత్‌ కాల్‌ రాబోతోందని  జైశంకర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 

ఒక సినిమా తీయడానికి అయిన ఖర్చు కంటే తక్కువ బడ్జెట్‌తో చంద్రయాన్‌-3 ని రూపొందించి మనం విజయం సాధించామని విద్యార్థులకు గుర్తు చేశారు. ఈ విజయంతో ప్రపంచమంతా భారత్‌ వైపు చూసిందని తెలిపారు. నెలకు దాదాపు 12 బిలియన్ల నగదు రహిత లావాదేవీలు జరుపుతూ భారత్‌ డిజిటల్ ఎకానమీగా ఎదుగుతోందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఏడాదిలో నాలుగు బిలియన్ల లావాదేవీలు జరిగే అమెరికా కంటే ఇది ఎక్కువ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు