Brahmastra: ఈ విశ్వంలో అత్యంత పురాతన శక్తి.. ఇంతకీ ఏంటా అస్త్రం?
‘‘ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది.. సామాన్యుల ఊహకు సైతం అందనిది అది.. అత్యంత పురాతన మహిమాన్విత శక్తి.. అ
ఇంటర్నెట్‌డెస్క్: ‘‘ఈ విశ్వంలో ఏదో జరుగుతోంది.. సామాన్యుల ఊహకు సైతం అందనిది అది.. అత్యంత పురాతన మహిమాన్విత శక్తి.. అదో అస్త్రం.. అదేంటి’ అంటూ ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra)లో శివగా రణ్‌బీర్ కపూర్ పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఒకటి. కరోనా వల్ల చాలా రోజులుగా సెట్స్‌పైనే ఉందీ చిత్రం. ఎట్టకేలకు ఈ డిసెంబర్‌తో చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, డింపుల్ కపాడియా, నాగార్జున తదితర అగ్ర తారలు ఇందులో నటించారు. రణ్‌బీర్ కపూర్ పోషించిన శివ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. పురాణ గాథతో అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..