తమిళ రీమేక్‌ కోసం చిరంజీవి-సుజీత్‌?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయమవంతమైన ‘లూసిఫర్' చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ‘యెన్నై అరింధాల్‌’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాకి దర్శకత్వం వహించేందుకు ‘సాహో’ దర్శకుడు సుజీత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Published : 28 May 2021 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మలయాళంలో విజయమవంతమైన ‘లూసిఫర్' చేస్తున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తమిళంలో హిట్ అయిన ‘యెన్నై అరింధాల్‌’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు చిరంజీవి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాకి దర్శకత్వం వహించేందుకు ‘సాహో’ దర్శకుడు సుజీత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారట. స్క్రిప్టు చిరంజీవికి నచ్చితే సినిమా పట్టాలెక్కనుందని చెప్పుకుంటున్నారు.

తొలుత ‘లూసిఫర్‌’ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే అనుకోని కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుజీత్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడిన ‘ఆచార్య’ షూటింగ్‌ జులైలో తిరిగి ప్రారంభం కానుందని సమాచారం. ఈ సినిమా పూర్తి కాగానే ‘లూసిఫర్‌’ సెట్స్ పైకి రానుంది. ఆ తర్వాతే చిరంజీవి - సుజీత్‌ల సినిమా ఉండనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తమిళంలో యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా తెరకెక్కిన ‘యెన్నై అరింధాల్’లో అజిత్ కథానాయకుడిగా త్రిష నాయికగా నటించి మెప్పించారు. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వం వహించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని