Sankranthi Movies: సంక్రాంతి సినిమాల పంచ్ డైలాగులు.. కొన్ని క్లాస్.. కొన్ని ఊరమాస్!
సంక్రాంతి సినిమాలు ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’, ‘తెగింపు’ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచాయి. ఆ సంభాషణలేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: జనవరి 11,12,13,14.. ఇలా ఒక్కో రోజు ఒక్కో అగ్ర హీరో సినిమా విడుదలతో ఈ ఏడాది సంక్రాంతి సందడి రెట్టింపుకాబోతోంది. ముందుగా అజిత్ (Ajith) ‘తెగింపు’ (Tegimpu), తర్వాత బాలకృష్ణ (Balakrishna) ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy), ఈ తర్వాత చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), చివరిగా విజయ్ (Vijay) ‘వారసుడు’ (Vaarasudu) చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. టీజర్, ట్రైలర్లలో వినిపించిన సంభాషణలు ఆయా హీరోల అభిమానులు, ప్రేక్షకుల్లో సినిమాలపై ఆసక్తి పెంచాయి. ‘వీరసింహారెడ్డి’లో ఎక్కువగా ఊరమాస్, మిగిలిన వాటిలో పవర్‌ఫుల్+ క్లాస్ సంభాషణలకు ఇప్పటికే ‘చప్పట్లు’ మోగాయి. థియేటర్లలో ‘విజిల్స్’ పడడమే తరువాయి. ఆ డైలాగ్స్‌ను ఓ సారి చూద్దామా..
అది వీరసింహారెడ్డి బాధ్యత..
🎬 సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదనే నేను ఒక్కడినే కత్తి పట్టా. పరపతి కోసమే, పెత్తనం కోసమే కాదు.. ముందు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత.
🎬 నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్. వీరసింహారెడ్డి.. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు.
🤜 సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.
🤜 పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ.
🎬 పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరకైనా వెళ్లు.. అక్కడ నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది (జై బాలయ్య).
🤜 అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను ఒంటి చేత్తో ఊచకోత కోస్తా.
🤜 మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్.
🤜 భయం నా బయోడేటాలోనే లేదురా.
🤜 నరకడం మొదలుపెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు.
వాల్తేరు వీరయ్య.. పక్కా లోకల్
🎬 మీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు.
🎬 వీడు నా ఎర.. నువ్వే నా సొర.
🤜 రికార్డ్స్‌లో నా పేరు ఉండడం కాదు. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్.
🤜 ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఇక్కడ వీరయ్య లోకల్.
🎬 ఫస్ట్‌టైమ్ ఒక మేక పిల్లను ఎత్తుకుని పులే వస్తాండాది.
వారసుడి విలువలు..
🎬 ఇన్ బిజినెస్ ఆల్వేస్ బీ అలర్ట్. వేటగాడు తన కళ్లల్లో మట్టి పడినా కళ్లు తెరిచే ఉంచాలి.
🎬 వేటగాడికి వేటే వృత్తి. వెళ్లి మీ నాన్నకు చెప్పు ఈ సీట్‌లో హీట్ ఏంటో ఇకపై చూస్తాడు (విలన్ వెర్షన్)
🤜 పవర్ సీట్‌లో ఉండదు సర్. అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో ఉంటుంది. మన పవర్ ఆ రకం.
🤜 ప్రేమో, భయమో నాకిచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వు. ఎందుకంటే నువ్వు ఏది ఇచ్చినా నేను దాన్ని ట్రిపుల్‌గా ఇచ్చేస్తాను. నా గురించి నీకు తెలియదు కదా.
🤜 గ్రౌండ్‌లో ఎంతమంది ప్లేయర్స్ అయినా ఉండొచ్చు. కానీ ఆడియన్స్ అంతా ఒక్కడిని మాత్రమే చూస్తారు. ఎవరినో తెలుసా?.. ఆట నాయకుణ్ని.
👩👩👦👦 ఇల్లు అనేది ఇటుక, ఇసుకేరా వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా.
👩👩👦👦 కుటుంబం అన్నాక లోపాలుంటాయ్. కానీ మనకంటూ ఉండేది ఒకే ఒక కుటుంబం.
అజిత్ తెగింపు ఇదీ..
🎬 ఒక దొంగ బ్యాంక్‌లోకి ఎంటరైతే లోపల ఉన్నవాళ్లు ఏం చేయాలంటే.. రూల్ నంబరు 1: హీరోలా నటించొద్దు. ఆ పని నేను చూసుకుంటా.
🤜 బ్యాంక్‌లోకి వచ్చి బీరు, బ్రాందీ అడుగుతారా?
🤜 బుద్ధున్నోడెవడైనా నాలాంటి కంత్రిగాడితో పెట్టుకుంటాడా?
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sidharth Malhotra: సిద్ధార్థ్ ‘బోల్డ్ అనౌన్స్మెంట్’.. ఆయన చెప్పబోయేది దాని గురించేనా?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Odisha: ఏఎస్సై కాల్పుల ఘటన.. తూటా గాయాలతో ఒడిశా ఆరోగ్య మంత్రి కన్నుమూత
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!
-
Sports News
U 19 World Cup: అండర్ - 19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమ్ఇండియా
-
General News
Ts News: గుజరాత్లో పంచాయతీ సర్వీస్ పరీక్ష పేపర్ లీక్.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు